Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు.
చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.