Poverty: భారత్‌లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poverty: దశాబ్ధాలుగా పేదరికంతో బాధపడుతున్న భారతదేశం, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పేదరికం తగ్గముఖం పట్టింది. గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. యూన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(UNDP), ఆక్స్‌ఫర్డ్ ‘పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్(OPHI)లు కలిసి ‘గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’(MPI) వెల్లడించాయి. భారత్ తో సహా చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో కలిపి 25 దేశాలు పేదరికాన్ని సగానికి తగ్గించుకున్నాయని నివేదిక తెలిపింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే (2005-06- 2019-2021)లో 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో 55.1 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 16.4 శాతానికి పడిపోయినట్లు నివేదికి పేర్కొంది. 2005-06లో దేశంలో దాదాపుగా 64.5 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకి, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది. 110 దేశాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా MPIని రూపొందించారు.
Also Read
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
Read Also: GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
ఇదిలా ఉంటే ఎంపీఐ గణాంకాల ప్రకారం..110 దేశాల్లోని 6410 కోట్ల మంది జనాభాలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. వీరిలో 84 శాతం మంది గ్రామీణులే ఉన్నారు. 110 కోట్ల మందిలో 56 కోట్ల మంది 18 ఏళ్లలోపు వారే. మొత్తం పేదల్లో సబ్ సహారా ఆఫ్రికాలోనే 53.4 కోట్ల మంది, దక్షిణాసియాలో 38.9 కోట్ల మంది ఉన్నారు. ప్రతీ ఆరుగురిలో పేదల్లో దాదాపుగా ఐదుగురు ఈ ప్రాంతాల వారే ఉన్నారు. మూడింట రెండొంతుల మంది పేదలు మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నాట్లు నివేదిక వెల్లడించింది. ఈ దేశాల్లో పేదరికాన్ని అంతమొందించాలంటే అనేక చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయితే పేదరికం తగ్గుదలపై కరోనా పరిస్థితులను కూడా అంచనా వేయాల్ని ఉందని తెలిపింది.
భారతదేశంలో వివిధ సూచికల్లో పేదల తగ్గుదల ఇలా ఉంది.(2005-06 నుంచి 2019-21 వరకు)
*పోషకాహర లేమి – 44.3 శాతం నుంచి 11.8 శాతానికి
* వంట ఇంధనం- 52.9 శాతం నుంచి 13.9 శాతానికి
*పారిశుద్ధ్యం- 50.4 శాతం నుంచి 11.3 శాతానికి
* తాగు నీరు-16.4 శాతం నుంచి 2.7 శాతానికి
*గృహనిర్మాణం- 44.9 శాతం నుంచి 13.6 శాతానికి
*శిశుమరణాలు -4.5 శాతం నుంచి 1.5 శాతానికి
తాజావార్తలు
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!