Mumbai: మహారాష్ట్ర ముంబైలోని బోరివాలిలో ఇవాళ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. బోరివాలి వెస్ట్‌లోని సాయిబాబా నగర్లో భవనం కుప్పకూలగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని తనిఖీ చేపట్టారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు, రెండు రెస్క్యూ వ్యాన్లు, మూడు అంబులెన్స్‌లు ఇప్పటికే ఘటనాస్థలిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. భవనం శిథిలావస్థకు చేరిందని, దానిని ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Accident: షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
గతంలో కూడా ముంబయిలో ఇలాంటి ఘటనే జరిగింది. జూన్ 27న ముంబైలోని కుర్లాలోని నాయక్ నగర్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50వేలు ప్రకటించారు.
A four-storey building collapses in Saibaba Nagar of #Borivali West in #Mumbai . The building was vacated as it was declared dilapidated.
Gitajali Building, #SaibabaNagar, Nr Saibaba Temple, Borivali (W). Details: Gitajali Building (G+3) structure collapsed. pic.twitter.com/qdYEROLiQm
— KRoshan (@Kroshan4k) August 19, 2022