Mumbai: జనాలపైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి, 29 మందికి గాయాలు
- ముంబై నగరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం..
- పాదచారులపైకి దూసుకెళ్లిన బెస్ట్కు చెందిన బస్సు..
- ప్రమాదంలో 4 మృతి, 29 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: ముంబైలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం (డిసెంబర్ 9) రాత్రి 9.30 గంటల సమయంలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అయితే, ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా డ్యూటీ చేస్తున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం విచారణ చేస్తోంది. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌ను ఎంక్వైరీ చేస్తున్నారు.
Read Also: pushpa 2 : ఓవర్సీస్ లో మైల్ స్టోన్ మార్క్ అందుకున్న పుష్ప రాజ్
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ఇక, కుర్లాలోని ఎస్‌జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, మరో ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Read Also: Belagavi: బెళగావిపై రెండు రాష్ట్రాలు మళ్లీ ఘర్షణ.. ఆదిత్య ఠాక్రే, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం!
కాగా, ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్‌ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ప్రమాదంలో గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో జరిగిన ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయపడ్డారు. పలువురు ప్రాణ భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఇక, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది.
#Mumbai : Out of control BEST bus mows down several pedestrians and vehicles in Kurla West, Mumbai, late Monday evening.
Four dead and several others injured.
Police said all the injured have been rushed to Bhabha Hospital. pic.twitter.com/oOlWtSxX1p— Saba Khan (@ItsKhan_Saba) December 9, 2024
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!