Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart attack: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 24 గంటల్లో భార్యభర్తలు మరణించారు. ఘజియాబాద్‌లోని ఓ యువ జంట జూ సందర్శనకు వెళ్లారు. 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెపోటుతో మరణించగా, అతని భార్య అంజలి షాక్ తట్టుకోలేక ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది నవంబర్ 30న ఇద్దరికి వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: Space station: 2035 నాటికి సొంత “అంతరిక్ష కేంద్రం”.. ప్రధాని ప్రకటన..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
సోమవారం వీరిద్దరు ఢిల్లీలోని జూ కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అభిషేక్‌కి ఛాతిలో నొప్పి అనిపించిందని, అంజలి తన స్నేహితులను సాయంతో అతడిని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించింది. దురదృష్టవశాత్తు అభిషేక్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటు కారణంగా అతడు మరణించినట్లు వెల్లడించారు. రాత్రి సమయంలో ఘజియాబాద్ వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్మెంట్‌కి మృతదేహం చేరుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక అంజలి ఏడో అంతస్తులోని బాల్కానీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించించారు, చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున అంజలి మరణించింది. అభిషేక్ శవం పక్కనే కూర్చుని ఏడుస్తూ, వెంటనే బాల్కనీ వైపు పరిగెత్తిందని, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించేలోపే కిందకు దూకిందని బంధువులు వెల్లడించారు.
ఇటీవల కాలంలో యవతలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తులు హఠాత్తుగా కుప్పకూలుతున్నారు. 30 ఏళ్ల పూర్తి కాకముందే గుండెపోటులకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. వివాహ వేడుకల్లో, గర్బా కార్యక్రమాల్లో ఉన్నట్టుండి యువకులు గుండెపోటుకు గురైన ఘటనలు ఇటీవల కాలంలో చూశాం. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!