Civil Services Exam: ఎంతో మందికి స్పూర్తిగా “సారిక”.. అరుదైన వ్యాధితో బాధపడుతూ సివిల్స్ సాధించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Civil Services Exam: అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఓ యువతి యూనియన్ పబ్లిక్ సర్వీస్(యూపీఎస్‌సీ) రాసి ర్యాంక్ సాధించింది. కండరాల కదలికను ప్రభావితం చేసే పట్టుకతో వచ్చే ‘‘సెరిబ్రమ్ పాల్సీ’’ అనే వ్యాధితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని సారిక ఏకే అనే యువతి సివిల్స్ సాధించారు. తన రెండో ప్రయత్నంలో సారిక ఈ ఘనత సాధించారు. తన కుడి చేతిని ఉపయోగించలేని సారిక ఎడమచేతి ద్వారా మోటరైజ్డ్ వీల్ చైర్‌ని ఉపయోగించే వారు. తన రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించి 922వ ర్యాంక్ సాధించారు.
తాను ఈ రిజల్ట్స్ చూసి షాక్ అయ్యానని సారిక చెప్పారు. నేను సివిల్స్ క్లియర్ చేయాలని ఆశించాను, తాను ఈ ఆనందాన్ని చెప్పడాని తన దగ్గర మాటలు లేవని అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని, తన కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయుల మద్దతు కారణంగానే ఈ ఘటన సాధించినట్లు సారిక వెల్లడించారు. తన తల్లిదండ్రులే తనకు పెద్ద మద్దతును ఇచ్చారని చెప్పారు. వైకల్యంలో బాధపడుతున్న ఇతరుకు సందేశం ఇస్తూ పాలో కోయెల్హో రాసిన ‘‘ఆల్కెమిస్ట్’’ పుస్తకం నుంచి ఒక ప్రసిద్ధ వ్యాఖ్యాన్ని చెప్పారు. ‘‘మీరు నిజంగా ఏదైనా కోరుకున్నప్పుడు.. దానిని సాధించడంలో విశ్వం మొత్తం మీకు సాయం చేస్తుంది’’ అని అన్నారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Read Also: Dubai Rains: భారత్-దుబాయ్ మధ్య విమాన సర్వీస్‌లు రద్దు.. ఎప్పటివరకంటే..!
పరీక్ష సమయంలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఆమె చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షా కేంద్రం కోజికోడ్‌లో ఉందని, వికలాండులకు అనుకూలంగా సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. మెయిన్స్ పరీక్ష్ కోసం తిరువనంతపురం వెళ్లాల్సి వచ్చిందని, వారం రోజుల ప్రక్రియ కావడంతో ఆమె తన తల్లిదండ్రులతో అక్కడే అద్దె రూంలో ఉంటూ పరీక్షకు వెళ్లానని చెప్పింది. తన ఎగ్జామ్ కోసం ఖతార్‌లో పనిచేస్తు్న్న తన నాన్న తిరిగి వచ్చినట్లు చెప్పారు. రాతపరీక్షలో తనకు సాయం చేసేందుకు రైటర్ సాంయ తీసుకున్నట్లు చెప్పారు. తన ఇంటర్వ్యూ ప్రక్రియ ఢిల్లీలోని కేరళ హౌజ్‌లో జరిగిందని చెప్పారు. అయితే, ఐదుగురు సభ్యులు ఉన్న ఇంటర్వ్యూ ప్యానెల్ ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించారని చెప్పారు. తన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్, కోజికోడ్ గురించి అడిగారని, కరెంట్ అఫైర్స్ గురించి తక్కువ ప్రశ్నలు ఉన్నాయని సారిక తెలిపారు.
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!