Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో తీరికలేనంత బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన బాహుబలి ది ఎపిక్ మూవీ నేడు ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాహుల్ రవీంద్రన్ బయట పెట్టాడు. ప్రస్తుతం రాహుల్ మామూలుగానే తెల్లగడ్డంతో ఎవరూ గుర్తు పట్టలేకుండా ఉన్నాడు. ఇక ఫౌజీ సినిమా కోసం పూర్తిగా తెల్లబడ్డ జుట్టు, గడ్డం లుక్ లో ఉంటాడంట. అదే లుక్ లో నేను, ప్రభాస్ సెట్ లో ఎదురుపడ్డాం.
Read Also : Spirit : అలాంటి పాత్రలో కనిపించనున్న ప్రభాస్.. నిజమేనా..?
ఆయనకు నేను నమస్తే పెట్టడంతో ఆయన కూడా హలో ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దగ్గరకు వెళ్లి ఆ యాక్టర్ ఎవరు అని అడిగాడంట. అతను రాహుల్ రవీంద్రన్. నా ఫస్ట్ సినిమా అందాల రాక్షసి హీరో అంటూ చెప్పాడు. దాంతో ప్రభాస్ నా దగ్గరకు వచ్చి సారీ గుర్తు పట్టలేదు అని మాట్లాడించాడు. అలా మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. ప్రభాస్ చాలా జోవియల్ గా ఉంటాడు. ఎలాంటి విషయాలను అయినా ఓపెన్ గా చెప్పేస్తాడు. అతని గురించి బయట ప్రచారం జరిగినట్టు సైలెంట్ గా ఉండడు. సెట్ లో అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు అంటూ తెలిపాడు రాహుల్.
Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్ కు రూ.200 కోట్లు.. ఏంట్రా ఇది..