Karnataka: గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. భారీ ఊరేగింపుతో సంబరాలు
- గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్
- భారీ ఊరేగింపుతో సంబరాలు
- కర్ణాటకలోని హవేరిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆడ బిడ్డపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. కొన్ని నెలల జైలు అనంతరం నిందితులు బెయిల్ విడుదలయ్యారు. నిందితులు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లుగా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. బైకులు, కార్లతో సంబరాలు చేసుకుంటూ భారీ ఊరేగింపుతో రోడ్లపై తిరిగారు. నిందితులంతా చిరునవ్వులు నవ్వుతూ.. చేతులు ఊపుతూ సంతోషంగా సాగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో పోలీసులు కూడా కనిపిస్తున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. అత్యాచార నిందితుల ర్యాలీని అడ్డుకోకపోవడమేంటి? అని నిలదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
మైనార్టీ వర్గానికి చెందిన బాధితురాలు.. 40 ఏళ్ల కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుంది. జనవరి 8, 2024న హనగల్‌లోని ఒక ప్రైవేటు హాటల్‌లో గది బుక్ చేసుకుని ఏకాంతంగా న్నారు. ఇంతలో కొంత మంది పురుషుల బృందం హోటల్ గదిలోకి ప్రవేశించి ఆమెను సమీపంలోని అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యంత ఘోరంగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: KTR : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారింది..
అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు… అనుమానితులను గుర్తించి సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. మిగతా వారంతా ఆమెను వేధించడం… భౌతికదాడికి పాల్పడ్డారు. తొలుత పోలీసులు స్ట్రాంగ్‌గా కేసు నమోదు చేయకపోవడంతో జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్‌కు అధికారిక వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం పోలీసులు సీరియస్‌గా నమోదు చేశారు.
నిందితుల్లో పన్నెండు మంది దాదాపు 18 నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రధాన నిందితులైన ఏడుగురికి ఇటీవల బెయిల్ వచ్చింది. వారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం హవేరిలోని అక్కి ఆలూర్ పట్టణంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. భారీ కాన్వాయ్‌తో పాటు బైకర్లు పాల్గొన్నారు. సంగీతం పాటు పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ వచ్చారు. నిందితులు చిరునవ్వులు నవ్వుతూ ఉంటే.. బైకర్లు సంబరాలు చేసుకుంటూ వచ్చారు. వీరిని పోలీసులు ఆపే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మహిళా సంఘాలు ముక్కున వేలు వేసుకుంటున్నాయి. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అని వాపోతున్నారు.
ఏడుగురు ప్రధాన నిందితులైన అఫ్తాబ్ చందనకట్టి, మదర్ సాబ్ మందక్కి, సమివుల్లా లలనావర్, మొహమ్మద్ సాదిక్ అగసిమణి, షోయిబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సావికేరిలకు ఇటీవల హవేరి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
🚨DISGUSTING: Gang rape accused in Karnataka WELCOMED with roadshow after bail.
Seven accused of a gangrape reported in January 2024 from Haveri, Karnataka, were recently granted bail by a local court.
Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar,… pic.twitter.com/rXx19gzdLs
— Manobala Vijayabalan (@ManobalaV) May 23, 2025
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!