Jammu Kahmir Encounter: ఇద్దరు ఉగ్రవాదుల హతం.. జవాన్ని కాపాడుతూ ఆర్మీ డాగ్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kahmir Encounter: జమ్మూ కాశ్మీర్లో రాజౌరీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మంగళవారం సాయంత్రం జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ లాబ్రడార్ కాల్పుల్లో మరణించింది.
Read Also: Apple IPhone 15: ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్‌కు రూ.4 లక్షల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసుకోండి
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
రాజౌరీలోని నార్ల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండగా.. ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరిగినట్లు అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. జమ్మూ ప్రాంతంలో ఉండే పూంచ్, రాజౌరీ జిల్లాలు చాలా ఏళ్ల క్రితమే ఉగ్రవాదం నుంచి బయటపడ్డాయి. కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యక్రమాలు జరగుతున్నప్పటికీ జమ్మూ ప్రాంతంలో ఈ కార్యకలాపాలు తక్కువగా ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో జమ్మూలోని రియాసీ, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పీఓకే సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో 25 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఇందులో 10 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
తాజాగా రాజౌరీలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఆర్మీ డాగ్ యూనిట్ కు చెందిన కెంట్ అనే డాగ్ మరణించడంపై పలువురు జవార్లు ఎమోషనల్ అయ్యారు. తన హ్యాండ్లర్ ప్రాణాలు రక్షించేందుకు కెంట్ తన ప్రాణాలను త్యాగం చేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు తగిలి మరణించింది. కెంట్ త్యాగానికి గుర్తుగా ఆర్మీ ఒక వీడియోను షేర్ చేసింది. కెంట్ గత 5 ఏళ్లలో 8 ఆపరేషన్లలో పాల్గొంది. దట్టమైన అటవీ మార్గంలో కెంట్ ఉగ్రవాదుల జాడను పసిగట్టింది.
Sad news coming in-
Brave Canine Warrior KENT of 21 Army Dog Unit laid down her life serving in ongoing OP SUJALIGALA at Rajouri, J&K earlier today – 12 September 2023.
The six year old female Labrador was leading a column of soldiers on the trail of fleeing terrorists. The… pic.twitter.com/L5j7MDZNiX
— LestWeForgetIndia🇮🇳 (@LestWeForgetIN) September 12, 2023
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?