Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు.…
Modi, Chandrababu Meeting: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులతో చంద్రబాబు ముచ్చటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ భేటీకి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కమిటీ సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో శనివారం…
CM Jagan Tributes to Pingali Venkaiah: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి…