Assam: ముంచెత్తిన వరద.. “ర్యాట్ హోల్” బొగ్గు గనిలో చిక్కుకున్న 18 మంది కార్మికులు..
- అస్సాంలో ర్యాట్-హోల్ బొగ్గు గనిలో ప్రమాదం..
- గనిలోకి నీరు చేరడంతో చిక్కుకుపోయిన 18 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంలోని డిమా హసావో జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 300 అడుగుల లోతున్న క్వారీలోకి నీరు రావడంతో కార్మికులు ‘‘ర్యాట్ హోల్’’ బొగ్గు గనిలో చిక్కుకుపోయారు. అక్రమ గని మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న మారుమూల పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో ఉంది. గనిలో దాదాపుగా 100 అడుగుల మేర నీరు చేరిందని, సహాయక చర్యలకు తీవ్రమైన అంతరాయం కలుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మోటార్ల సాయంతో నీటిని బయటకు తీస్తున్నారు.
Read Also: Andhra Pradesh: 2 రోజుల్లో భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. రియల్ ఎస్టేట్ పెరిగేలా నిబంధనలు..
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కొనసాగుతున్న రెస్క్యూ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్మీ నుంచి సాయం కోరింది. “కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో మేము ఆర్మీ సహాయాన్ని అభ్యర్థించాము. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కూడా ప్రయత్నాలలో సహాయం చేయడానికి సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి” అని చెప్పారు.
ర్యాల్ హోల్ మైనింగ్ అనేది ప్రమాదకరమైన పద్ధతి. కార్మికులు ఇరుకైన సొరంగాల్లో మాన్యువల్‌గా తవ్వుతుంటారు. ఈ సొరంగాలు లోతైన గుంటలకు దారి తీస్తాయి. వీటి నుంచి బొగ్గు తవ్వి తీస్తుంటారు. 2018లో, మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో సమీపంలోని నది నుండి నీరు రావడంతో 15 మంది మైనర్లు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో కేవలం 2 మృతదేహాలను మాత్రమే లభ్యమైనట్లు రెస్క్యూ సిబ్బంది చెప్పింది. 2019లో, మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ. 100 కోట్ల జరిమానా విధించింది. రాష్ట్రంలోని 24,000 గనుల్లో చాలా వరకు అక్రమ గనులు ఉన్నాయని ఎన్జీటీ తేల్చింది.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!