Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి కన్నతల్లినే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
17 Year Old Girl Killed Her Mother With Help Of Her Lover: మధ్యప్రదేశ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుని ప్రేమ మాయలో పడి, తన కన్నతల్లినే కడతేర్చింది ఓ మైనర్. తమ ప్రేమకు అడ్డుగా ఉందని.. ఆమెను కత్తిపొట్లతో పొడిచి, అత్యంత క్రూరంగా చంపేసింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన ఓ మైనర్ (17) చాలాకాలం నుంచి ఒక అబ్బాయి (25)తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా, చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. ఓరోజు వీళ్లిద్దరు యువతి తల్లి మమతా కుష్వాహా కంటపడ్డారు. ఆ అబ్బాయి ఎవరని నిలదీయగా.. తాను ప్రేమిస్తున్నానని ఆ యువతి తెలిపింది. దీంతో.. ఇంకోసారి ఆ అబ్బాయిని కలవొద్దని, ప్రేమ దోమా లాంటివన్నీ మానెయ్యమని తల్లి సూచించింది. ఆ అబ్బాయికి కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా వాళ్లు ఆమె మాటలు పట్టించుకోకుండా.. తరచూ కలవడం మొదలుపెట్టారు.
Big Breaking: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. సభలు, ర్యాలీలపై నిషేధం
Also Read
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
కట్ చేస్తే.. రెండు నెలల క్రితం ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. అప్పుడు వాళ్లు శారీరకంగా కలిశారు. ముందునుంచి వీరి ప్రేమను వ్యతిరేకిస్తున్న తల్లి మమతా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు మైనర్ అని, మాయమాటలు చెప్పి ఆ యువకుడు తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. వారి ఆచూకీ కనుగొన్నారు. అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో వేయగా, అమ్మాయిని తల్లి మమతాకి అప్పగించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆ అబ్బాయి.. మళ్లీ అమ్మాయిని కలవడం మొదలుపెట్టాడు. దీంతో మమతా మరోసారి అతడ్ని హెచ్చరించింది. తన కూతుర్ని మరోసారి కలవడానికి ప్రయత్నిస్తే, తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమకు తల్లి అడ్డుపడుతోందని, కూతురు ఆమెపై కక్ష పెంచుకుంది. ఆమె అడ్డు తొలగించుకోవాలంటే.. అంతమొందించడమే మార్గమని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది. తొలుత కత్తితో మమతా గొంతు కోసిన వాళ్లిద్దరు.. ఆ తర్వాత విచక్షణారహితంగా పొడిచి, కిరాతకంగా చంపేశారు.
Instagram Job Fraud: ఆన్‌లైన్ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ మాట్లాడుతూ.. ‘‘శనివారం తన ప్రియుడితో కలిసి మైనర్ అమ్మాయి తల్లిని హతమార్చింది. ఆదివారం ఉదయం వాళ్లిద్దరినీ మేము అరెస్ట్ చేశారు. నేరకార్యకలాపాలకు పాల్పడే యువకుడితో ఆ అమ్మాయికి రిలేషన్‌షిప్ ఉందని తెలిసింది. మృతురాలి ఫిర్యాదు మేరకు మేము రెండు నెలల క్రితమే నిందితుడ్ని అరెస్ట్ చేశాం. అయితే.. అతడు గత నెల బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఇంతలోనే తన ప్రియురాలితో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు’’ అని చెప్పారు.
Kakinada Fire Accident: కాకినాడ గొల్లప్రోలులో భారీ అగ్నిప్రమాదం.. నిప్పంటించి దుండగులు పరార్
తాజావార్తలు
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!