A Khammam Girl Doped By Online Fraudsters: ఈమధ్య మోసగాళ్లు ట్రెండ్‌కి తగిన విధానాల్ని అనుసరించే మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. నిరుద్యోగులనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతని గుర్తించి, మంచి ఉద్యోగాల పేరుతో ఊరించి, లక్షలకు లక్షలు దోచేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే ఎంతో సునాయాసంగా బాధితులకు శఠగోపం పెడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఈ ఆన్‌లైన్ మోసానికే బలి అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు, మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఏకంగా ఏడు లక్షలు కోల్పోయింది. తీరా తాను మోసపోయానని తెలుసుకొని, పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Delhi: యువతిని ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. ఈ ఘటనపై ఆప్, ఎల్జీ మధ్య మాటల యుద్ధం
తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఓ యువతి, కొంతకాలం నుంచి ఒక మంచి ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఈమధ్య ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లోనూ జాబ్ ఆఫర్స్ వస్తుండటంతో.. ఆ మాధ్యమాల్లోనూ ఈ యువతి జాబ్ కోసం పరిశోధించింది. ఈ క్రమంలోనే ఒక ఇన్‌స్టా ఖాతా చూసి, మెసేజ్ (డీఎమ్) చేసింది. ఇంకేముంది.. తాము వేసిన గాలంలో చేప దొరికిందని భావించి, అవతలి దుండగులు కాస్త మసాలా వడ్డించడం స్టార్ట్ చేశాడు. గ్లోబల్ సిస్టమ్ పేరుతో పరిచయం చేసుకున్న ఆ అపరిచిత వ్యక్తులు.. ఆమెకు మంచి ప్యాకేజ్‌తో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. కొన్ని ఫేక్ ఫోటోలు కూడా షేర్ చేశారు.
Kakinada Fire Accident: కాకినాడ గొల్లప్రోలులో భారీ అగ్నిప్రమాదం.. నిప్పంటించి దుండగులు పరార్
ఆ దుండగులు పంపిన ఫోటోలు, చెప్పిన ప్యాకేజ్ చూసి.. ఆ యువతి టెంప్ట్ అయ్యింది. అయితే.. ఈ ఉద్యోగం రావాలంటే, ఏడు లక్షలు కట్టాలని వాళ్లు షరతు పెట్టారు. మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశతో, ఆ యువతి ఏడు లక్షల రూపాయల్ని పలు దఫాలుగా ఆన్‌లైన్‌లో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతే.. మళ్లీ వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎన్నిసార్లు కాంటాక్ట్ అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి.. అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాము దుండగుల పని చూస్తామని, ఆ డబ్బు తిరిగి ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
Delivery Boy Attacked: ఆర్డర్ ఆలస్యం అయ్యిందని.. డెలివరీ బాయ్‌పై దాడి