ఢిల్లీని కరోనా వణికిస్తోంది. కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్లో 400 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టెస్టులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వరసగా బయటపడుతున్నాయి. కోర్టులో 3 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 150 మందికి కరోనా నిర్ధారణ జరిగింది.
Read: ఢిల్లీ బాటలో రాజస్థాన్… ప్రజలకు తప్పని కర్ఫ్యూ కష్టాలు…
కోర్టు ఆవరణలోనే కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు. జనవరి 3 నుంచి రెండు వారాలపాటు వర్చువల్ విధానంలో కేసులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో 150 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా అందరికీ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో చాలా వరకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.