Delhi: దేశంలో అసెంబ్లీ ఎన్నికల జోరు సాగుతోంది. ఈ ఎన్నికల పోరు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. కాగా ఎన్నికల బరిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో లెక్కాపత్రం లేని నగదు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా మాట్లాడుతూ. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు ముందే ఆదాయ పన్ను విభాగంతో సహా దర్యాప్తు సంస్థలు నల్లధనం పైన నిఘా పెంచాయని తెలిపారు. కాగా టోల్‌ఫ్రీ నెంబర్ల ద్వారా సరైన ఆధారాలు లేని నగదు, నగలకు సంబంధించిన సమాచారం తమకు అందుతోందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఆధారాలు లేని నగదు, ఆభరణాలకు సంబంధించిన సోదాలు ముమ్మరం చేసామని గుప్తా వెల్లడించారు.
Read also:Train Accident: పట్టాలపై చెక్క దిమ్మె, ఇనుప రాడ్లు.. రైలును ఢీకొట్టించే కుట్ర
అలానే ఈ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం సహా రాష్ట్రాల ఎన్నికల అథారిటీ సమన్వయంతో జరుగుతున్నట్లు తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఓటర్లకు ఉచిత కానుకలు, నగదు, మందు, మాధకద్రవ్యాల పంపిణీని అరికట్టేందుకు జులైలో లోనే అధికారులు పాటించాల్సిన నిబంధనలను సీబీఐసీ జారీ చేసిందని.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వీటిని రూపొందించిందని తెలిపిన ఆయన.. ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నిఘా పెంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన తనిఖీలలో రాజస్థాన్‌లో అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి.. స్వాధీనం గతంతో పోలిస్తే మూడింతలు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. 2021 లో స్వాధీనం చేసుకున్న వాటి విలువ .322 కోట్లు ఉండగా 2022లో రూ.347 కోట్లు ఉంది. అయితే 2023లో అక్టోబర్ వరకు రూ.1,021 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.