ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. మమతా బెనర్జీ కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన అని, రాజకీయ పర్యటన కాదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించేందుకు వెళ్తున్నారని స్పష్టం చేస్తున్నారు.