Yuvan Shankar Raja Decactivates Insta Account afer huge trolling: యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. ఇప్పటి వరకు ఆయన సంగీతంలో విడుదలైన పాటలన్నీ మెగా హిట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ప్రస్తుతం నటుడు విజయ్ నటిస్తున్న “గోట్” సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. మదన్ కార్తీ సాహిత్యం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన “గోట్” చిత్రంలోని మొదటి సింగిల్ సాంగ్ “విజిల్ పోడు” ఇటీవల విడుదలైంది. ఈ పాటకు కొందరి నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ, ఈ పాటకు యువన్ సరిగ్గా మ్యూజిక్ కంపోజ్ చేయలేదని కొందరు ఆరోపిస్తున్నారు, ముఖ్యంగా విజయ్ అభిమానులు.
Pushpa 2: బన్నీ ఆల్ టైం రికార్డ్.. బాలీవుడ్ స్టార్స్ ను సైతం తలదన్ని!
ఈ సందర్భంలో, ఇప్పుడు యువన్ శంకర్ రాజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అతని చివరి పోస్ట్‌కు చాలా ప్రతికూల వ్యాఖ్యలు రావడం అని అంటున్నారు. ఈ సినిమాలోని విజిల్ పోడు అనే సింగిల్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఈ పాటకు ఓ మోస్తరు ఆదరణ లభించింది. పాట విన్న అభిమానులు అసలు యువన్‌కి ఏమైంది అంటూ ఓపెన్‌గా కామెంట్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో యువన్ శంకర్ రాజా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని డిలీట్ చేశారు. ఇకఅతను ప్రముఖ తమిళ సంగీత స్వరకర్త. ఆయన తెలుగులో కూడా “ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే”, “7G బృందావన కాలనీ”, “హ్యాపీ,” “ఓయ్”, “పంజా”, “కస్టడీ” వంటి అనేక తెలుగు సినిమాలకు కూడా పని చేశాడు.