మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముందు నుంచే చాలా క్లోజ్‌గా ఉండేవారు. కాకపోతే ట్రిపుల్ ఆర్ సినిమాతో వీళ్ల ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసింది. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు. స్టేజీ పైనే రాజమౌళితో కలిసి ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో చెప్పి ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఈ ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఒకేసారి పాన్ ఇండియా మరియు గ్లోబల్ ఈమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. శంకర్‌తో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తుండగా.. కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.
ఎంత బిజీగా ఉన్నా సమయం వచ్చినప్పుడల్లా చరణ్, తారక్ కలుస్తునే ఉంటారు. అయితే ఇటీవల రామ్ చరణ్‌కి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 10ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెగా ప్రిన్సెస్‌కి క్లింకారా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టికి ఎన్టీఆర్ ప్రత్యేకమైన కానుకను పంపించారట. చరణ్, ఉపాసన, క్లీంకార… ముగ్గురి పేరుతో ఉన్న గోల్డ్ డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌ను తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా క్లింకారకు అందించినట్లు సమాచారం.