మెగా నందమూరి అభిమానుల మధ్య ఉన్న ప్రొఫెషనల్ రైవల్రీ ఇప్పటిది కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా మెగా నందమూరి హీరోల మధ్య ఆ వార్ జరుగుతూనే ఉంది. టాలీవుడ్ లో పీక్ స్టేజ్ ఫ్యాన్ వార్ ని ఆన్ లైన్-ఆఫ్ లైన్ రెండు చోట్ల తగ్గకుండా చేసే అభిమానులు ఉన్నంత కాలం ఈ రైవల్రీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే అభిమానుల మధ్య ఎంత ఉన్నా, తమ మధ్య ఎంత పోటీ ఉన్నా అది సినిమాల వరకు మాత్రమే పరిమితం అని ఎప్పటికప్పుడు మెగా నందమూరి హీరోలు నిరూపిస్తునే ఉంటారు. ఇటీవలే బాలయ్య-రామ్ చరణ్ కలిసిన మరోసారి ఈ విషయాన్ని నిజం చేసి చూపించారు. లేటెస్ట్ గా చిరు బర్త్ డే రోజున ఎన్టీఆర్ చిరుకి బర్త్ డే విషెష్ చెప్తూ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ని మెగా నందమూరి ఫ్యాన్స్ రీట్వీట్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు.
మ్యూచువల్ ఫ్యాన్స్ కి ఈ మధ్య కాలంలో ఇదే బెస్ట్ మూమెంట్ అనే చెప్పాలి. రామ్ చరణ్-బాలయ్య కలయిక… ఎన్టీఆర్ చిరుకి బర్త్ డే విషెష్ లాంటివి చూస్తూ ఉంటే భరత్ అనే నేను సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు చెప్పినట్లు “మేము మేము బాగానే ఉంటాం… మీరు మీరు ఇంకా బాగుండాలి” అనే మాట గుర్తొస్తుంది. ప్రొఫెషనల్ రైవల్రీ అనేది ఉంటే సినిమాల కలెక్షన్స్ వస్తాయి, ఇండస్ట్రీ బాగుంటుంది కానీ పర్సనల్ గొడవలు మాత్రం ఏ హీరోల అభిమానుల మధ్య ఉండడం, ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ బూతులు తిట్టుకోవడం మంచిది కాదు. ఈ విషయం అర్ధం చేసుకోని సినీ అభిమానులు ఉంటే బాగుంటుంది.
Wishing Chiranjeevi Garu @KChiruTweets a very happy birthday. Have a happy and healthy year ahead sir.
— Jr NTR (@tarak9999) August 22, 2023