Read Also: Devara Glimpse: 72 సెకండ్స్ వీడియోతో వస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో…
2023లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖుల్ని కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా బాధాకరమైన ఘటనలతో సినీ అభిమానులు నిరాశ చెందారు. ఆత్మీయులని, ఆప్తులని కోల్పోయిన వాళ్లు నిరాశ చెందారు. తాజాగా 2024 ప్రారంభమైన 4 రోజులకే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. బేబీ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్.కె.ఎన్ తండ్రి గారు గాదె సూర్యప్రకాశరావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యప్రకాశరావు ఈరోజు మరణించారు. దీంతో ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్.కే.ఎన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీ వర్గాలు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. సూర్యప్రకాశరావు గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గం.లకు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో జరుగనున్నాయి.
Read Also: Sankranthi Movies: డైలమాలో ఈగల్? ముందుకొచ్చిన నా సామిరంగ?