Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanatha Kaanom OTT Release : తమిళ నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ మూవీ ‘కేనతా కానోమ్’. థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలలకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో చూడని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేయచ్చు. 2026 మార్చి 13న థియేటర్లలో విడుదలైన ‘కేనతా కానోమ్’ మూవీ జూన్ 16 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సురేష్ సంగయ్యకు తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దురదృష్టవశాత్తూ ఆయన ఇక లేరు. అయితే ‘కేనతా కానోమ్’ రూపంలో ఆయన మరోసారి ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు.
సోషల్ అంశాలను సెటైరకల్ పంచ్ లతో కలిపి చెప్పే ఆయన శైలి ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలో యోగి బాబు తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు లవ్లీన్ చంద్రశేఖర్, రైచల్ రబెక్కా, జార్జ్ మేరియన్, రామకృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. ఆర్బి టాకీస్ బాక్స్ ఆఫీస్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రం భారీ కమర్షియల్ హిట్ కాకపోయినా, కంటెంట్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు అసలు పరీక్ష ఓటీటీ వేదికపైనే. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ‘కేనతా కానోమ్’ డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో చాలా సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే విశేషమే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Tags
- cinema
- JioHotstar
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!