కొలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు పేరు అందరికీ తెలుసు.. తెలుగు ప్రేక్షకులను తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.. ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.. ఇకపోతే తాజాగా ఈయన తాను కూతురు కూతురు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
తమిళ సినిమాల్లో యోగి తన కామెడీతో జనాల మనసులో చోటు సంపాదించుకున్నాడు.. స్టార్ కమెడియన్‌గా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవలే రిలీజైన రజినీకాంత్ చిత్రం జైలర్‌లోనూ మెప్పించారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జవాన్‌లో కనిపించారు. 2009లో ‘యోగి’ అనే తమిళ చిత్రంలో నటించి ఫేమస్ అవ్వడంతో అప్పటినుంచి ప్రేక్షకులు తనను యోగి బాబుగా గుర్తుపెట్టుకున్నారు. అలా కమెడియన్గా కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా కూడా యోగి బాబుకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రావడానికి మాత్రం కాస్త సమయం పట్టింది.
దాదాపు 2014 నుంచి యోగి బాబు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతీ ఏడాది అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, వారిని నవ్వుల్లో ముంచేసేవాడు. మెల్లగా అవకాశాలు పెరిగాయి. ఇప్పుడైతే ఏకంగా ఏడాదికి 10కు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు యోగి బాబు.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం అయాలన్‌లో నటిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..