తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు తమ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి తోచిన ప్రయత్నం చేస్తున్నారు. అలా ఏ మాత్రం ఊహించని విధంగా ‘బలగం’ సినిమాలో మంచి విజయాన్ని సాధించాడు వేణు ఎల్దండి. అప్పటి వరకు కమెడియన్‌గా అలరించిన వేణు, ఈ మూవీతో దర్శకుడిగా తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నా. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ తో మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంత బాగున్నప్పటికీ.. ఈ సినిమాలో హీరో ఎంపిక విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.
Also Read : Mirai: నా కెరీర్‌కి ఈ రోల్.. దేవుడు ఇచ్చిన వరం : మనోజ్
ప్రారంభంలో కథ నానికు వినింపించగా, తర్వాత తేజ సజ్జా, ఆపై నితిన్‌కు, నితిన్ నుండి ఈ ప్రాజెక్ట్ శర్వానంద్ దగ్గరికి వచ్చింది. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రస్తుతం సినిమాలో ఎవరు నటించబోతున్నారో స్పష్టత లేదు. ఇందులో భాగంగా తాజాగా తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ధనుష్ ఈ సినిమాలో నటిస్తే, సినిమా తెలుగు, తమిళ రెండు మార్కెట్లలో కూడా మంచి విజయాన్ని సాధించగలదని భావిస్తున్నారు. ధనుష్ వరకు ఈ కథ చేరితే భారీ బజ్, ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. అంతే కాదు కొంత మంది ఫ్యాన్స్ ధనుష్‌కు తెలుగు స్లాంగ్ అర్థమవుతుందా? లేక వేరే హీరోతో డబ్బింగ్ చేయాలా? అని కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి, ‘ఎల్లమ్మ’ సినిమాలో ఫైనల్ హీరో ఎవరు అవుతారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.