Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ సినిమా బిజినెస్‌పై పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు రిటర్నబుల్ బేసిస్‌పై దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నెట్టింట ప్రచారం జరుగుతున్నట్లుగా ‘టాక్సిక్’తో దిల్ రాజుకు నష్టం తప్పదనే వార్తలు సరికాదని, ఈ సినిమాతో అన్ని విధాలుగా ఆయనకే ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ముందుగా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం రూ.108 కోట్లకు కమిట్మెంట్ జరిగినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.80 కోట్లకు సవరించినట్లు తెలుస్తోంది. చివరి దశలో కొనుగోలుదారులు సుమారు రూ.75 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇందులో ఆంధ్రా నుంచి రూ.35 కోట్లు, సీడెడ్ నుంచి రూ.10 కోట్లు, తెలంగాణ నుంచి మరో రూ.30 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ‘టాక్సిక్’లో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాటా సగానికి కూడా తక్కువగా ఉండగా, మిగిలిన మెజారిటీ వాటా హీరో యశ్దేనని సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమా వసూళ్లలో తేడా జరిగితే 45 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా యశ్ ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజుతో పాటు ఇతర కొనుగోలుదారులు కూడా ధైర్యంగా బిజినెస్‌లోకి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read
- Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
- Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
- NTR Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
ఇక ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. దిల్ రాజు కోసం ఓ సినిమా చేయడానికి యశ్ ఇప్పటికే కమిట్ అయినట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’తో ఏర్పడే లోటును యశ్ భర్తీ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఆ మొత్తాన్ని భవిష్యత్‌లో దిల్ రాజుతో చేయబోయే సినిమాకు అడ్వాన్స్‌గా పరిగణించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే టాక్సిక్ రిజల్ట్ ఎలా ఉన్నా దిల్ రాజుతో యశ్ కాంబినేషన్లో మరో సినిమా ఉండే అవకాశాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో కేవీఎన్ సంస్థ నుంచి కూడా దిల్ రాజుకు మరో కీలక ప్రయోజనం దక్కనున్నట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా రాబోయే సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమా నైజాం రైట్స్‌ను దిల్ రాజుకు ఇచ్చేందుకు కేవీఎన్ సూత్రప్రాయంగా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇలా చూస్తే ‘టాక్సిక్’ రిలీజ్ ఎలా ఉన్నా దిల్ రాజుకు పలు రకాలుగా ప్రయోజనం కలిగేలా డీల్స్ కుదిరినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడితే లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు, నష్టమొచ్చినా రికవరీకి ఒప్పందాలు, యశ్‌తో మరో సినిమా, సంక్రాంతికి ‘కాకా’ నైజాం రైట్స్ వంటి ప్రయోజనాలు దక్కనున్నాయని సమాచారం. దీంతో ‘టాక్సిక్’ బిజినెస్‌లో అసలు బిగ్ బెనిఫిషియరీ దిల్ రాజే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..