Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeep Reddy Vanga: 2027లో భారీ పాన్ ఇండియా సినిమాల జాతర బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు తెరతీయబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. అంటే ఈ రెండు భారీ చిత్రాల మధ్య దాదాపు 32 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.
ఇంత తక్కువ వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో వాటి మధ్య గ్యాప్ సరిపోతుందా? అనే ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా, సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా తెరకెక్కిన రోమాంచకం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. రెండు సినిమాల మధ్య కేవలం 32 రోజుల గ్యాప్ ఉందని, అది సరిపోతుందని అని ప్రశ్నించగా.. తన దైనశైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్పిరిట్’ కంటే ‘వారణాసి’ చాలా పెద్ద సినిమా అని వంగా వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తించింది. ‘వారణాసి’కి దారిచ్చేందుకు ‘స్పిరిట్’ను వాయిదా వేయాలని మీరు అనుకుంటున్నారా? అంటూ ఆయన సరదాగా వేసిన కామెంట్స్ ఈవెంట్లో నవ్వులు పూశాయి. బడ్జెట్ పరంగా చూస్తే ‘వారణాసి’కి భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘స్పిరిట్’కు హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా నార్త్ ఇండియాలో సినిమా ఎక్కువ రోజులు ప్రభావం చూపించవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఒకదాని తర్వాత మరొకటి విడుదల కానున్న ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎవరి సినిమా ఎంతటి వసూళ్లు సాధిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారనుంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!