Yash: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. సీరియల్స్తో తన కెరీర్ మొదలుపెట్టి హీరోగా.. స్టార్ హీరోగా మారాడు. కెజిఎఫ్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక నేటితో కెజిఎఫ్ 2 వచ్చి ఏడాది పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు యష్ తన తదుపరి సినిమాను ప్రకటించింది లేదు. ఈ డైరెక్టర్ తో యష్ నటిస్తున్నాడు.. ఆ డైరెక్టర్ తో యష్ పనిచేస్తున్నాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ లో యష్ నెక్స్ట్ సినిమా ఉంటుంది.. ఈ రూమర్స్ వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ, మనోడు మాత్రం కొత్త సినిమా ప్రకటించింది లేదు. ఆచితూచి అడుగులు వేయాలన్న ముందు జాగ్రత్త ఓకే కానీ మరీ ఇంత సమయమా..? అసలు యష్ కు సినిమా తీసే ఉద్దేశ్యం ఉందా లేదా..? అని అభిమానులు అనుమానిస్తున్నారు అంటే అతిశయోకి కాదు.
Prema: సౌందర్య తల లేదు.. మొండెం మాత్రమే ఉంది.. వాచ్ చూసి
కెజిఎఫ్ 2 తరువాత యష్ వాణిజ్య ప్రకటనల్లో చూడడమే తప్ప వెండితెరపై చూడలేదు అభిమానులు. కొద్దిగా ఓపిక పట్టండి ముందు ముందు మంచి వార్తలు వస్తాయి అని అభిమానులు తమకు తామే ఓదార్చుకుంటున్నారు కానీ, వారిలో కూడా యష్ నుంచి కొత్త సినిమా ప్రకటన వస్తుంది అనే ఆశ లేదన్నట్టే కనిపిస్తోంది. అప్పుడెప్పుడో కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వంలో యష్ హీరోగా ఒక సినిమా వస్తుంది అన్నారు. కానీ, ఆ కథ యష్ కు నచ్చకపోవడంతో అది స్క్రిప్ట్ దగ్గరే ఆగిపోయిందని తెలిసింది. ఇక ఆ తరువాత ప్రశాంత్ నీల్ తోనే ఇంకో సినిమా అన్నారు. కానీ, నీల్.. ఒకపక్క సలార్ తో .. ఇంకోపక్క ఎన్టీఆర్ 31 తో బిజీగా ఉన్నాడు. కెజిఎఫ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నారు.. కానీ, యష్ మాత్రం అక్కడే ఆగిపోయాడు. కనీసం ఈ ఏడాది అయినా ఆ సినిమా ఏదో ప్రకటించు రాఖీ బాయ్ .. అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి అభిమానుల కోరికను రాఖీ భాయ్ మన్నిస్తాడో లేదో ..? చూడాలి.