ఖాన్ లు, కపూర్ లు నార్త్ బాక్సాఫీస్ ని ఏకధాటిగా ఏలుతున్న సమయంలో సౌత్ నుంచి ప్రభాస్, యష్ లాంటి హీరోలు బాలీవుడ్ పునాదులని కూడా కుదిపేసారు. ఖాన్ లు, కపూర్ లు కాదు సౌత్ నుంచే సినిమాలు చేస్తూ నార్త్ బాక్సాఫీస్ ని సొంత చేసుకుంటానని చెప్తూ ప్రభాస్ ఇప్పటికే భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రాజెక్ట్ Kతో పాన్ వరల్డ్ రేంజుకి కూడా వెళ్లనున్నాడు. KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 8న తన పుట్టిన రోజునా అయినా యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తాడు అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ ని యష్ పెంచుతూనే ఉన్నాడు కానీ ఎండ్ కార్డ్ వేయట్లేదు.
KGF సీరీస్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన యష్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడు. రాఖీ భాయ్ అనే క్యారెక్టర్ ని తన స్టైల్ అండ్ స్వాగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే ప్రశ్నకి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ‘మఫ్టీ’ ఫేమ్ ‘నర్తన్’ దర్శకత్వంలో యష్ సినిమా ఉంటుందని కొందరు, ప్రశాంత్ నీల్ తోనే ‘KGF 3’ చేస్తాడని మరికొందరు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఇంకొందరు… ఇవేమి కాదు సుధా కొంగర దర్శకత్వంలో యష్ నటిస్తాడని కొందరు మాట్లాడుకుంటున్నారు కానీ వీటిలో ఏది ఫైనల్ అయ్యిందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరో వైపు యష్ ఫాన్స్ మాత్రం “KGF సినిమా జపాన్ లో రీరిలీజ్ కూడా అవుతుంది అన్నా… ఇంకెన్ని రోజులు సినిమా చేయకుండా ఉంటావ్. ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్” అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతమంది వెయిటింగ్ కి యష్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.