రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో “KGF 2” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో తమిళ స్టార్ విజయ్ “బీస్ట్”పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కేజీఎఫ్ : చాప్టర్ 2”, “బీస్ట్” కేవలం ఒక్కరోజు గ్యాప్ తో పాన్ ఇండియా సినిమాలుగా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.
Read Also : Ram Charan Birthday Celebrations : వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?
ఏప్రిల్ 14న “కేజీఎఫ్ : చాప్టర్ 2”, ఏప్రిల్ 13న “బీస్ట్” రిలీజ్ అవుతున్నాయి. దీంతో సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా రెండు సినిమాలకు మధ్య పోటీ నెలకొందని భావిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన యష్ “కేజీఎఫ్ : చాప్టర్ 2″ చిత్రాన్ని”బీస్ట్” సినిమాతో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. సినిమా రంగానికి విజయ్ ఎంతో కృషి చేశారని యష్ కొనియాడారు. ఒక చిత్రాన్ని మరో మూవీతో పోల్చడానికి ఇవేవీ ఎన్నికలు కావని, సినిమా రంగమని, సినిమాలను చూద్దామని అన్నారు. భారతీయ చిత్ర రంగంలో సంబరాలు చేసుకుందాం అంటూ అభిమానులకు యష్ పిలుపునిచ్చారు. “ఆయనొక పెద్ద స్టార్… మనం ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మేము 8 నెలల క్రితమే సినిమా విడుదల తేదీని ప్రకటించాము. ఆయన అభిమానులకు ‘బీస్ట్’ సినిమా విడుదల అనేది పండగ లాంటిది. ఇది KGF 2 vs Beast కాదు… KGF 2 and Beast… విజయ్ అభిమానులకు KGF 2 కూడా ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాము” అంటూ చెప్పకొచ్చారు.