KGF మూవీలో “అమ్మ మాటిది కన్నా కాదనకు జన్మమన్నది ఒంటరి కడవరకు” అనే లిరిక్స్ తో, అద్భుతమైన సాంగ్ తో ప్రేక్షకుల గుండెలను ఎమోషన్ తో పిండేశాడు దర్శకుడు. ఇక ఇప్పుడు KGF Chapter 2 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ భాగంలో కూడా అలాంటి ఎమోషనల్ సాంగ్ ఉంటుందా ? ఉంటే ఆ సాంగ్ అంత డీప్ గా, ఎమోషనల్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటుందా? అని యష్ అభిమానుల్లో నెలకొన్న అనుమానాన్ని తాజా సాంగ్ తో పోగొట్టేశారు మేకర్స్. తాజాగా “ఎదగరా దినకరా” అంటూ KGF Chapter 2లోని ఎమోషనల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. ఈ సాంగ్ కు తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సుచేత బస్రూర్ ఈ సాంగ్ ను పాడారు. ఇక ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా, “ఎదగరా దినకరా” సాంగ్ ను తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఎమోషనల్ కట్టిపడేస్తున్న ఈ హార్ట్ టచింగ్ సాంగ్ కు అంతా ఫిదా అవుతున్నారు.
Read Also : The Kashmir Files : దర్శకుడికి అరుదైన గౌరవం… పీఎంకు స్పెషల్ థ్యాంక్స్
యాష్ హీరోగా తెరకెక్కిన KGF Chapter 2 సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. KGF 2 మూవీ 2018లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన చిత్రం KGF 1కి సీక్వెల్. ఈ హిట్ ఫ్రాంచైజీ రెండవ భాగంలో యష్ తో పాటు సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ నటించారు. ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
https://www.youtube.com/watch?v=Zq5-8tQ9eOQ
Voice of every MOTHER!#GaganaNee:https://t.co/PTouFjV3vF#YadagaraYadagara:https://t.co/pJwSJFogbI#AgilamNee:https://t.co/4Lv4c3cCph#GaganamNee:https://t.co/7iVw0AiYYr
Music by @RaviBasrur
#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @LahariMusic pic.twitter.com/16X2ppNQce— Hombale Films (@hombalefilms) April 6, 2022