నిన్న మొన్నటి వరకు సలార్ కలెక్షన్స్ కి షారుఖ్ ఖాన్ అడ్డు వస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు షారుఖ్ దాదాపుగా సైడ్ అయిపోయినట్టే. డంకీ సినిమాను డిసెంబర్ 22 నుంచి జనవరికి షిప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సలార్, డంకీ క్లాష్ అయితే థియేటర్లతో పాటు కలెక్షన్స్ కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడు డంకీ పోస్ట్‌పోన్ అయింది కాబట్టి సలార్‌కు ఎదురు లేకుండా పోయింది. సలార్‌కు పోటీగా షారుఖ్ ఖానే భయపడ్డాడంటే… ఇంకెవ్వరు ఆ సాహసం చేయడానికి ఛాన్సే లేదు. డిసెంబర్ 22న డైనోసర్ సోలోగా దండయాత్రకు దిగుతుండడంతో మూడు వారాల పాటు బాక్సాఫీస్‌ను ప్రభాస్‌కు రాసిచ్చేసినట్టైంది. సంక్రాంతి వరకు సలార్‌దే హవా. ఈ మూడు వారాల్లో చాలా హాలిడేస్ కలిసి రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే సలార్ బాక్సాఫీస్ లెక్కలు మామూలుగా ఉండవు. టాక్‌తో సంబంధం లేకుండా… ఓపెనింగ్స్‌లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది సలార్.
ఇక హిట్ టాక్ పడితే… రికార్డులన్నీ చెల్లా చెదురు అవడం పక్కా. ఇప్పటి వరకు అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా… చైనా వసూళ్లతో కలుపుకొని రెండు వేల కోట్లకు పైగా రాబట్టి… టాప్ ప్లేస్‌లో ఉంది కానీ ఇండియన్ లెక్క ప్రకారం 1800 కోట్లకు పైగా రాబట్టిన బాహుబలి2దే టాప్ ప్లేస్. ఇప్పటి వరకు ఈ రికార్డులను టచ్ చేయడం ఎవరి వల్ల కాలేదు. అయితే ప్రభాస్, లేదంటే రాజమౌళికి మాత్రమే బాహుబలి2 రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా ఉంది. మహేష్ బాబుతో కలిసి రాజమౌళి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి… సలార్‌కు సాలిడ్ హిట్ టాక్ పడితే ఖచ్చితంగా ఇండియన్ సినిమా హైయ్యెస్ట్ గ్రాసర్‌గా సలార్ నిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే కెజియఫ్2తో 1200 కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే… మూడు ఫ్లాపుల తర్వాత ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చే సినిమా సలార్ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు. అది, ఇది అని కాదు.. అన్ని సెంటర్స్‌లో సలార్ దుమ్ముదులిపేయడం గ్యారెంటీ. ఫ్లాప్ టాక్‌తోనే వందల కోట్లు రాబట్టిన ప్రభాస్‌కు.. సలార్‌కు హిట్ టాక్ పడితే టాప్ ప్లేస్‌కి వెళ్తుంది… యావరేజ్ టాక్ పడితే వెయ్యి కోట్లు రాబట్టడం ఖాయం. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.