Akshay Kumar: ఈ రీమేక్ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తావా ఖిలాడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. గతేడాది 5 సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్షయ్ కుమార్ స్టొరీ సెలక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఒక్క హిట్ కూడా లేకుండా అక్షయ్ కుమార్ ఒక సీజన్ ని కంప్లీట్ చెయ్యడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ చెయ్యడానికి అక్షయ్ కుమార్ 2023ని ‘సెల్ఫీ’ సినిమాతో స్టార్ట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న ‘సెల్ఫీ’ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నాడు.
Read Also: Akshay Kumar: భూమి పుట్టక ముందు పుట్టావ్.. అక్షయ్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
Also Read
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’కి రీమేక్ గా ‘సెల్ఫీ’ సినిమా తెరకెక్కుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సిన ఒక స్టార్ హీరోకి, అతని ఫ్యాన్ అయిన ఒక ట్రాఫిక్ పోలిస్ కి మధ్య జరిగే ఇగో వార్ గా సెల్ఫీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ట్రైలర్ 1, సాంగ్స్ తో ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లిన మేకర్స్ లేటెస్ట్ గా సెల్ఫీ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ కథ మొత్తాన్ని ఈ సెకండ్ ట్రైలర్ లో రివీల్ చేసేశారు. ఇంటెన్స్, ఈగోయిస్టిక్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన సెల్ఫీ సినిమా అక్షయ్ కుమార్ ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ వేస్తుందేమో చూడాలి.
Ek #Selfiee ke chakkar mein, sankat shuru!
Watch the drama and entertainment unfold with the #SelfieeTrailer2 now! 🎬🍿https://t.co/8JT2bJN1b4And catch Selfiee in cinemas, Feb 24.@akshaykumar @emraanhashmi @Nushrratt @DianaPenty #KaranJohar @apoorvamehta18
— Dharma Productions (@DharmaMovies) February 15, 2023
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!