సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తూ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది అనిమల్ మూవీ. రణబీర్ కపూర్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. ఒక కథని చెప్పడంలో సందీప్ రెడ్డి కన్విక్షన్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీస్ కూడా అనిమల్ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా అనిమల్ సినిమాని చూసి చిత్ర యూనిట్ మొత్తాన్ని పేరు పేరున అభినందిస్తూ ట్వీట్ చేసాడు. అయితే అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన రాజమౌళి, మహేష్ బాబుల నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు.
సందీప్ రెడ్డి వంగని రామ్ గోపాల్ వర్మతో పోలుస్తూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చిన జక్కన, అనిమల్ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. చిన్న సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేసే మహేష్ బాబు కూడా అనిమల్ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. ఈ ఇద్దరు అనిమల్ సినిమాని చూడలేదా? లేక చూసినా నచ్చలేదా అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం రాజమౌళి, మహేష్ బాబులకు అనిమల్ సినిమా నచ్చలేదేమో అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అనిమల్ సినిమాని ఈ వీకెండ్ చూసి రాజమౌళి, మహేష్ లు ట్వీట్ చేస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే అనిమల్ సినిమాని పొగిడే వాళ్లు ఎంతమంది ఉన్నారో విమర్శించే వాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. ముఖ్యంగా నార్త్ లో అనిమల్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. టాక్సిక్ మూవీ అంటూ అనిమాల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇవే కామెంట్స్ సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాకి కూడా వినిపించాయి. మరి ఈసారి సందీప్ నెగటివ్ కామెంట్స్ పై ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది చూడాలి.