Pawankalyan : సాధారణంగా హీరోలు ఎవరూ ఇతర హీరోలతో పోల్చుకోరు. తాను పలానా హీరో కంటే చిన్న అని అస్సలు ఒప్పుకోరు.. బయటకు చెప్పుకోరు. అలా చెబితే ఆ హీరో ఫ్యాన్స్ దారుణంగా హర్ట్ అవుతారు. పైగా సదరు హీరో గారికి ఇగో హర్ట్. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తనను తాను కొందరు హీరోలతో పోల్చుకుని.. వాళ్లకంటే తాను చిన్న హీరోను అని చెప్పుకుంటున్నాడు. ఇలా ఒకసారి కాదు.. పలుమార్లు చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ కొంత హర్ట్ అవుతున్నారు. ఏపీ ఎన్నికల టైమ్ లో చాలా సభల్లో ఆయన ఇదే మాట్లాడారు. ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తనకంటే పెద్ద హీరోలు అని.. అది చెప్పడానికి తానేమీ నామూషీగా ఫీల్ అవ్వను అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ రోజు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో కూడా ఇదే మాట.
Read Also : HHVM vs Kingdom : వీరమల్లు దెబ్బకు అయోమయంలో కింగ్ డమ్..!
మిగతా హీరోలతో పోల్చుకుంటే తన సినిమాలకు పెద్దగా బిజినెస్ జరగదు అంటూ మాట్లాడాడు. ఎవరూ అడగకపోయినా ఆయన ఎందుకు ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారో ఫ్యాన్స్ కు అర్థం కావట్లేదు. ఇలా అనడం వల్ల పవన్ తన స్థాయిని తనే తగ్గించుకున్నట్టు అవుతుంది కదా. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత.. ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయారు. రాజకీయాల్లో ఉండటం వల్ల పవన్ సినిమాలపై ఫోకస్ తగ్గించారు. అందువల్ల వాళ్ల మార్కెట్ పెరిగింది. ఆ విషయాలను తాను ఒప్పుకోకపోతే.. పవన్ సినిమాలు వాళ్ల స్థాయిలో కలెక్షన్లు రాబట్టాలనే పోటీ పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ సినిమాల రిలీజ్ కు ముందే ఈ విషయాన్ని తాను స్వయంగా చెప్పడం వల్ల.. ఒకవేళ కలెక్షన్లు తక్కువ వచ్చినా ట్రోల్స్ చేయడానికి అవకాశం ఉండదు. తనను విమర్శించడానికి, ట్రోల్స్ చేయడానికి అవతలి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే పవన్ ఇలాంటి స్టేట్ మెంట్లు ఏమైనా ఇస్తున్నారా అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.
Read Also : Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..
