Akhil Akkineni: టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒక కుటుంబం.. అక్కినేని కుటుంబం. ఇండస్ట్రీనే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లెగెసీ ని కాపాడుతూ వస్తున్న వారసుడు అక్కినేని నాగార్జున. ఇక తాత, తండ్రి లెగెసీని కాపాడిల్సిన బాధ్యత అక్కినేని నట వారసులు అయిన నాగ చైతన్య, అఖి మీద ఎంతైనా ఉంది. జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చై. మొదటి సినిమానే హీరోయిజం, మాస్ ఎలివేషన్స్ , యాక్షన్స్ గుప్పించి అక్కినేని వారసుడు అంటూ పరిచయం చేయాలనుకున్నాడు నాగ్. కానీ, అక్కినేని అంటే ఒక రొమాన్స్ , లవ్ స్టోరీ అనే బ్రాండ్ ను మర్చిపోయాడు. దీంతో అదికాస్తా బోల్తాకొట్టింది. ఇక ఈ విషయం అర్ధం చేసుకున్న చై.. కొద్దిగా యాక్షన్ ను పక్కన పెట్టి తన కుటుంబానికి అచ్చి వచ్చిన లవ్ స్టోరీని నమ్ముకొని ఏ మాయ చేసావే సినిమా తీశాడు. చై కెరీర్ ఎన్నేళ్లు అయినా అతడి కెరీర్ గురించి మాట్లాడితే ఏ మాయ చేసావేనే గుర్తొస్తుంది. అంతటి హిట్ అయ్యింది. సరే .. ఒక హిట్, మూడు ప్లాపులు.. ఒక హిట్.. ప్లాపులు మధ్య చై కెరీర్ నత్త నడకగా సాగుతూనే వస్తోంది. ఇక అదే సమయంలో అయ్యగారు ఎంట్రీ ఇచ్చాడు.
Prabhudeva: ఏందీ బ్రో.. ప్రభుదేవాకు రెండో పెళ్లి అయ్యిందా.. ఇదెక్కడి ట్విస్ట్
సిసింద్రీ.. ఏడాది వయస్సు ఉన్నప్పుడే బెరుకు లేకుండా అఖిల్ కెమెరా ముందు నటించి ఔరా అనిపించాడు. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మనం సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ గా కనిపించి మెప్పించాడు. అదుగో అక్కడ మొదలయ్యింది అఖిల్ ప్రయాణం. సాధారణంగా నెపో కిడ్స్ అంటే సినిమాలోకే వస్తారు అని రూల్ లేదు. వారికి వేరొక వ్యాపకాలు ఉంటాయి. ఆ విధంగా చెప్పాలంటే అఖిల్.. ఒక మంచి క్రికెట్ ప్లేయర్. ఇండియా తరుపున ఆడే సత్తా ఉన్న ఆటగాడు. మనం రిలీజ్ కన్నా ముందు అఖిల్.. ఒక మంచి క్రికెటర్ అవుతాడు అని అనుకున్నారు. కానీ, మనం రిలీజ్ తరువాత దెబ్బకు అయ్యగారు థింకింగ్ మార్చేసాడు. అక్కినేని నట వారసుడుగా అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ అన్న చేసిన తప్పునే తమ్ముడు కూడా చేసాడు. మొదటి సినిమాలోనే హీరోయిజం, యాక్షన్ అని చూపించి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అని చెప్పుకొచ్చారు. తీరాచూస్తే మనోడికి ఫస్ట్ సినిమా అచ్చి రాలేదు. సరే అప్పుడైనా అయ్యగారు కథలను ఎంచుకోవడంలో శ్రద్ద పెట్టాల్సింది. లేదు.. ఆ తరువాత.. హలో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు. సినిమా బాగానే ఉంది కానీ జనాలకు ఆ లాజిక్ మాత్రం నచ్చలేదు. అయ్యగారు ఎంట్రీ.. రీ ఎంట్రీ రెండు ప్లాపులుగా నిలిచాయి. సరే ముచ్చటగా మూడోసారి కొద్దిగా ప్లే బాయ్ లా ట్రై చేద్దాం అని తండ్రి టైటిల్ ను వాడి మిస్టర్. మజ్నుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక అది కూడా అయ్యగారికి విజయాన్ని అందించలేకపోయింది. ఇలా రెండేళ్లు.. రెండేళ్లు గ్యాప్ ఇస్తూ.. రీ లాంచ్ .. రీరీ లాంచ్ లు అవుతూ వస్తున్న సమయంలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో అయ్యగారు మొదటి హిట్ ను అందుకున్నాడు. సరే అయ్యగారి దశ తిరిగింది.. ఇకనుంచి వరుస హిట్లు వస్తాయి అనుకున్నారు.
Samantha: ‘ఖుషీ’గా నవ్వుతున్న సామ్.. ముత్యాలే రాలునేమో
ఏజెంట్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు అఖిల్. నేడు ఆ సినిమా రిలీజ్ అయ్యి.. మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో మళ్లీ అయ్యగారు బ్యాక్ టూ ఫెవిలియన్ కు వెళ్ళిపోయాడు. రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని చెప్పుకొస్తున్నారు. అయితే అయ్యగారు ఇలా ఫెయిల్యూర్ లు చూడడానికి కారణాలు ఇవే అని అభిమానులు అంటున్నారు. ఒకటి స్టోరీల ఎంపికలో తడబడడం.. కథ మనకు నప్పుతుందా..? లేదా..? అనేది చూడకుండా ఒప్పుకోవడం, రెండోది కుర్ర హీరోలు అందరు పాన్ ఇండియా.. అని వెళ్లిపోతున్నారు. అక్కినేని కుటుంబం ఒక్కటే ఇంకా అక్కడి వరకు వెళ్ళింది లేదు.. ఆ గమ్యాన్ని అందుకోవాలన్న తొందరలో అయ్యగారు.. ఇలా యాక్షన్ మూవీస్ చేస్తూ.. ఓటమి పాలవుతున్నారు. ఇక డైరెక్టర్స్ ను సైతం అఖిల్ ఎంచుకొనే విధానం కూడా నచ్చలేదని అంటున్నారు. ఇక ఏ మధ్యనే అక్కినేని కుటుంబ బరువును మోయలేనని, దాన్ని నుంచి బయటికి వస్తాను అని చెప్పుకొచ్చిన అఖిల్.. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా అయ్యగారికే ఇలా జరగడం అనేది చాలా బాధాకరమని చెప్పొచ్చు. మరి ముందుముందు అయ్యగారు ఎలా నిలబడతాడో చూడాలి.