Prabhudeva: ఇండియన్ మైఖైల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నాయా అన్నట్టు ప్రభుదేవా చేసే డ్యాన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా హీరో, డైరెక్టర్ అని తేడా ఉండకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభుదేవా. ఇక ఆయన పర్సనల్ లైఫ్ మొత్తం వివాదాలే అన్న విషయం కూడా అందరికి తెల్సిందే. ప్రభుదేవా మొదటి భార్య రామ లతా. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్న వారి జీవితంలోకి నయనతార ఎంట్రీ ఇచ్చింది. నయన్ తో ప్రేమలో పడ్డ ప్రభుదేవా.. ఆమెను పెళ్లాడడానికి సిద్దమయ్యాడు. దీంతో ప్రభుదేవా కోసం నయన్.. హిందూ మతాన్ని కూడా స్వీకరించింది. ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా పట్టించుకోకుండా ప్రభుదేవాతోనే జీవితం అనుకుంది. ఇక చివరికి ప్రభుదేవా చేతిలో అడ్డంగా మోసపోయింది. అందుకు కారణం ప్రభుదేవా మొదటి భార్య రామలత. ఆమె విడాకులకు ఒప్పుకోకుండా నయన్ పై మీడియాముందు కు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. తన కుటుంబాన్ని ముక్కలు చేసిన నయన్ జీవితం కూడా ముక్కలు అవుతుందని, తన ఉసురు ఆమెకు తగులుతుందని శాపనార్దాలు పెట్టింది.
Samantha: ‘ఖుషీ’గా నవ్వుతున్న సామ్.. ముత్యాలే రాలునేమో
ఇక 2011 లో రామలతకు ప్రభుదేవా విడాకులు ఇచ్చాడు. అప్పటినుంచి సింగిల్ గానే ఉంటున్నాడు అని అనుకున్నారు అభిమానులంతా.. కానీ, ప్రభుదేవాకు మూడేళ్ళ క్రితం హిమానీ సింగ్ ను వివాహమాడాడు. కరోనా సమయంలో ఎవరికి తెలియకుండా ఆయన హిమానీ ని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పటివరకు ఆమె బయట మీడియా కంటికి కనిపించింది లేదు. అయితే ఈ మధ్యనే ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం వలన ఈ పెళ్లి విషయం బయటపడింది. కొన్నిరోజుల క్రితం ప్రభుదేవా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుదేవాను వివాహం చేసుకోవడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈ జంట తిరుమలలో సందడి చేశారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భార్య చేయి పట్టుకొని ప్రభుదేవా శ్రీనివాసుడి సన్నిధానంలో అడుగులు వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రభుదేవా అభిమానులు ఈ ఫోటోలు చూసి.. ఏందీ బ్రో .. ప్రభుదేవాకు రెండో పెళ్లి అయ్యిందా..? అది మూడేళ్లు అయ్యిందా..? అని ఆశ్చర్యపోతున్నారు.