Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే మయోసైటిస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకోపక్క ఆమె నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్స్ రిలీజ్ చేస్తూ స్పెషల్ గా విషెష్ తెలుపుతున్నారు. ఇక తాజాగా సామ్ నటిస్తున్న చిత్రాల్లో ఖుషీ ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం నుంచి సామ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.
Jagapathi Babu: జగ్గూభాయ్.. అంత ఓవరాక్షన్ అవసరమా..?
పోస్టర్ లో బ్లూ కలర్ చుడిదార్ లో బ్యాగ్ పట్టుకొని నవ్వుతూ నడుస్తున్న సమంత ఎంతో అందంగా ఉంది. ముఖ్యంగా ఆ నవ్వు.. ఎంతో ప్యూర్ గా కనిపిస్తోంది. ఆ స్మైల్ తోనే మెస్మరైజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మొదటి పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు శివ. ఇక ఇప్పుడు ఈ పోస్టర్ తో మరోసారి ఖుషీ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ చూసిన సామ్ అభిమానులు అరెరే.. నవ్వితే ముత్యాలు రాలేనేమో అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.