ఎస్.ఎస్. తమన్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తక్కువ టైమ్ లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే మ్యూజిక్ తోనే కాదు క్రికెట్ లో కూడా తమన్ ఓ సంచలనం. బ్యాట్ పట్టాడంటే సిక్సులు మోత మోగిస్తాడు తమన్. తాజాగా సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ తరపున తమన్ దంచి కొడుతున్నాడు. తాజాగా తన మిత్రులు ఓంకార్, దర్శకుడు ప్రశాంత్ వర్మలతో కలిసి చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ ఎనర్జీతో కనిపించే తమన్ ఈసారి క్లీన్ షేవ్ లుక్‌లో కనిపిస్తూ ‘ ఏంట్రా మరి ఇంత అందంగా ఉన్నాను’ అని అన్నాడు.
దానికి బదులిస్తూ వీడియోలో క్లీన్ షేవ్ చేసిన తమన్‌ను చూసిన ఓంకార్, “పదేళ్లు వయసు తగ్గిపోయినట్టున్నారు” అంటూ సరదాగా కితాబిచ్చారు. దీనికి స్పందించిన తమన్, తన అసలు వయసు ఎంత అన్న ప్రశ్నకు “ఆధార్ కార్డులో ఉన్నంతే” అంటూ జోక్ చేశాడు. ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)లో తమ టీమ్‌కు ఓంకార్ కీపర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే మంచి ఫుడ్ తినిపిస్టా అని చెప్పి హోటల్ కు వెళ్లి తిని బిల్ తనతో కట్టించాడని ఆది సాయికుమార్ నుద్దేశించి ఆటపట్టించాడు తమన్. ఈ మొత్తం వీడియోలో తనదైన పంచులతో తమన్ ఫన్ మోడ్ లో అలరించాడు. మొత్తానికి తన సంగీతంతో పాటు కామెడీ టైమింగ్ తో, సరదా స్వభావంతో కూడా అభిమానులను అలరిస్తున్న తమన్ మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ మంచి స్పందనను రాబడుతోంది.
Also Read : Dhandoraa : ఎన్టీఆర్ ట్వీట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘దండోరా’