Tollywood Hero : టాలీవుడ్ లో హీరోలు ఇప్పుడంటే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు గానీ.. అప్పట్లో అయితే ఒకే ఏడాది పదుల కొద్దీ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకునేవారు. ఇప్పుడు మహా అయితే 50 సినిమాల్లో కూడా మన స్టార్ హీరోలు నటిస్తారో లేదో చెప్పలేం. కానీ 1980 ప్రాంతంలోని స్టార్లు మాత్రం వందలాది సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. ఈ ప్రశ్న వినగానే చాలా మంది చిరంజీవి అనుకుంటారు. కానీ చిరంజీవి కాదు ఆ హీరో వేరే ఉన్నారు.

Read Also : SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
అతనే సూపర్ స్టార్ కృష్ణ తన యాభై ఏళ్ల కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గాను సినిమాలు తీశారు. హీరోగానే ఎక్కువ సినిమాలు చేసిన కృష్ణ.. తన కెరీర్ లో 80 మంది హీరోయిన్లతో నటించారు. టాలీవుడ్ లో ఇంత మంది హీరోయిన్లతో నటించిన స్టార్ హీరో లేడు. ఇందులో ఎక్కువగా విజయనిర్మల తోనే సినిమాలు చేశారు. చివరగా 2016లో కనిపించారు. ఒకే ఏడాది 18 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కూడా కృష్ణకే ఉంది. ఇలా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కృష్ణ.. ప్రస్తుతం భౌతికంగా ఇక్కడ లేకపోయినా.. ఆయన మూలాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో పదిలంగానే ఉన్నాయి.
Read Also : Coolie : ఫ్రీగా ‘కూలీ’ టికెట్లు.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్