Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో జానీ సినిమా ఒకటి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా చేశాడు. సొంతంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇందులో కథ బాగానే ఉన్నా అప్పటి జనరేషణ్ కు ఇది కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమా కథ అనుకున్నప్పుడు చిరంజీవికి వినిపించాడు పవన్ కల్యాణ్. కథ ఈ జనరేషణ్ కు కనెక్ట్ కాకపోవచ్చు వద్దు అని చెప్పాడంట చిరంజీవి. కానీ పవన్ కల్యాణ్ కథను బాగా నమ్మాడు.
Read Also : Shraddha Das : డప్పు కొట్టిన హీరోయిన్.. తీన్మార్ డ్యాన్స్ తో రచ్చ
అందులో ఎలాంటి మార్పులు చేయకుండా అల్లు అరవింద్ నిర్మాణంలో మూవీని డైరెక్ట్ చేశాడు పవన్. అనుకున్నట్టు గానే మూవీ ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో డిజాస్టర్ అయింది. ఇందులోని పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత సొంతంగా డైరెక్షన్ చేయడం ఆపేశాడు పవన్ కల్యాణ్. దాని తర్వాత వరుసగా యూత్ ఫుల్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాడు పవన్ కల్యాణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Read Also : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం