Ashu Reddy: అషూరెడ్డి.. అషూరెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్స్ ద్వారా కుర్రకారుకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇప్పుడిప్పుడే ఈ చిన్నది హీరోయిన్ గా మంచి ఛాన్స్ లు సైతం అందుకుంటున్న ఆమె కెరీర్ లో ఒక పెద్ద నింద పడింది. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అమ్మడి పేరు కూడా యాడ్ అయ్యింది. ఆయన కస్టమర్ల లిస్ట్ లో అషూరెడ్డి కూడా ఒకరు అని తెల్సింది. గత వారం క్రితం నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. రెండు రోజుల పాటు ఆయనను విచారించిన పోలీసులు.. అతని వద్ద నుంచి కస్టమర్ల లిస్ట్ ను సంపాదించారు.
Ashu reddy: డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. వందల ఫోన్ కాల్స్.. అవకాశాలు లేకున్నా లగ్జరీ లైఫ్ అందుకేనా?
సెలబ్రిటీలు, నేతల కుమారులకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆయన ఒప్పుకున్నాడు. ఇక ఆ లిస్ట్ లో అషూరెడ్డి పేరు కూడా ఉండడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక ఈ డ్రగ్స్ వివాద నేపథ్యంలో అషూరెడ్డి పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకొచ్చింది. చేతికి సెలైన్ పెట్టి.. కుర్చీలో రెస్ట్ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ .. త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక సడెన్ గా ఈ ఫోటోలు చూసిన అభిమానులు అయ్యో అషూకు ఏమైంది.. చేతికి సెలైన్ ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఈ డ్రగ్స్ కేసు వలన ఏదైనా జరిగిందేమో అని చెప్పుకొస్తున్నారు. అసలు అషూరెడ్డికి ఏం జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.