సౌత్ సెన్సేషన్ అట్లీ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్ల సినిమా చేసిన అట్లీకి ఇప్పటివరకూ ఫ్లాప్ అనేదే లేదు. దళపతి విజయ్ తో మూడు సినిమాలు చేసి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అట్లీ, తన నెక్స్ట్ సినిమాని సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో చేస్తాడు అనే మాట వినిపిస్తోంది. వీరిలో అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది కానీ ప్రస్తుతం బన్నీకి ఉన్న లైనప్ ప్రకారం చూస్తే అట్లీతో ప్రాజెక్ట్ చేయడం ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు. పుష్ప 2 అయిపోగానే బన్నీ, త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా ఉంది. సో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్స్ లేదు.
అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా రోజులుగా వినిపిస్తున్న పేరు ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’. వైజయంతి క్రియేషన్స్ బ్యానర్ పై అశ్వినీ దత్, ఎన్టీఆర్-అట్లీ కాంబినేషన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. అట్లీ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయాలి, చర్చలు జరుగుతున్నాయి అని స్వయంగా అశ్వినీ దత్ ఒక ఫిల్మ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ అట్లీ-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏం అయ్యిందో ఎంత వరకు వచ్చిందో తెలియదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బిజీ అయిపోయాడు. దేవర, NTR 31, వార్ 2 సినిమాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2024 ఎండ్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏమైనా అట్లీ-ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు అట్లీకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఒక పక్కా కమర్షియల్ మాస్ సినిమా విత్ అట్లీ స్టైల్ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ.