Raviteja: అన్నయ్య ఇవన్నీ కాదు, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ సినిమా చేద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ అంటే ఎనర్జీ, స్క్రీన్ పైన విపరీతమైన జోష్ కనిపిస్తుంది రవితేజ ఉంటే. చిరు అంటే టైమింగ్, ఏ స్టార్ హీరోకి లేని కామెడీ టైమింగ్ చిరు సొంతం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాస్ సినిమా వస్తుంది అంటేనే బాక్సాఫీస్ ర్యాంపేజ్ గ్యారెంటి, ఇక బాస్ కి మాస్ మహారాజ్ కూడా తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇద్దరు మాస్ హీరోలు అన్నదమ్ములుగా కలిసి నటించి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాకి చిరు, రవితేజ మధ్య ఉన్న ఎమోషనే ఆయువు పట్టు. రవితేజ, చిరు తమ్ముడిగా నటించాడు కాబట్టే ఆడియన్స్ ఆ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అయ్యారు.
పండగ సీజన్ లో పండగ లాంటి సినిమా ఇచ్చిన చిరు, రవితేజలని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్తున్నారు. దీంతో ఓవర్ వెల్మ్ అయిన చిత్ర యూనిట్ వాల్తేరు వీరయ్య సక్సస్ మీట్ పెట్టారు. ఈ సక్సస్ మీట్ లో చిరు, రవితేజ లేకుంటే ఆ ఎమోషన్ పండదు అని చెప్పాడు. ఇదే స్టేజ్ పైన మాట్లాడిన రవితేజ, “అన్నయ్య ఇది కాదు కానీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేద్దాం” అన్నాడు. రవితేజ, చిరు లని పెట్టి సినిమా చెయ్యడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీ, ట్యూన్స్ ఇవ్వడానికి దేవి శ్రీ ప్రసాద్ రెడీ ఇక దర్శకుడు బాబీ కూడా రెడీ అయితే మరోసారి ఈ మెగా మాస్ కాంబోలో సినిమా చూసే అవకాశం వస్తుంది. అయితే చిరు, రవితేజల కామెడీ టైమింగ్ ని మ్యాచ్ చేసే కథ దొరకడం అంత ఈజీ కాదు. రైటర్, డైరెక్టర్ లు రక్తాలు చిందిస్తే కానీ ఈ మెగా మాస్ కాంబోని బాలన్స్ చేసే కథ పుట్టదు. ఆ రేంజ్ కథ రాయాలి అంటే టైం పడుతుంది కాబట్టి ఇప్పట్లో చిరు, రవితేజల కాంబినేషన్ లో సినిమా చూడలేము.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!