Waltair Veerayya Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ విడుదల అయ్యింది. మొదట్నుంచీ చిత్రబృందం చెప్తున్నట్టుగానే.. ఈ ట్రైలర్ పూనకాలు తెప్పించేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి చివరిదాకా.. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సముద్రంలో అలలని చీల్చుకుంటూ వచ్చే పడవ సీక్వెన్స్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌లో.. వీరోచితమైన డైలాగ్స్, మెగాస్టార్ గ్రేస్, రవితేజ మాస్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఫుల్లుగా నిండి ఉంది. ఇందులో ముఠామేస్త్రీ నాటి రోజుల్ని గుర్తు చేసేలా.. చిరు పాత్రని కాస్త చిలిపిగా తీర్చిదిద్దినట్టు స్పష్టమవుతోంది.
Koppula Eshwar : మంత్రి కొప్పుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు లోథా భేటీ
మాస్ మహారాజా రవితేజ ఎంట్రీతో ఈ ట్రైలర్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిందని చెప్పుకోవచ్చు. క్రాస్ సినిమా తరహాలోనే ఇందులో ప్యూర్ మాసిజంతో అతడు ఆకట్టుకున్నాడు. చిరు, రవితేజ మధ్య వచ్చే ఎపిసోడ్స్ థియేటర్లలో అరుపులు పెట్టించడం ఖాయమని ఇందులో చూపించిన సీక్వెన్సుల ద్వారానే అర్థం చేసుకోవచ్చు. మరీ స్పెషల్‌గా.. చివర్లో రవితేజ ‘‘హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కరికి బాక్సులు బద్దలైపోతాయి’’ అని చెప్పడం, ‘‘ఏంట్రా బద్దలయ్యేది, ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వీరయ్య లోకల్’’ అంటూ చిరు గట్టి కౌంటర్ ఇవ్వడం.. ఈ ట్రైలర్‌లోనే హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. చిరుతో పాటు రవితేజ స్క్రీన్స్ ప్రెజెన్స్ కూడా అదిరాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా వీరోచితంగా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది.
Gudivada Amarnath: బాలయ్య తాతను చూసేందుకు ఎవరు వస్తారు?
ఇక కంటెంట్ అంటారా.. ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్స్ స్మగ్లింగ్ అని ట్రైలర్ మొదట్లోనే చెప్పి.. ఈ స్టోరీ నేపథ్యమేంటో రివీల్ చేసేశారు. చూస్తుంటే.. డైరెక్టర్ బాబీ బలమైన కథనే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా.. బాస్ + మాస్ కాంబినేషన్‌తో ఈ ట్రైలర్ కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. మరి, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రాబోయే ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. అన్నట్టు ఇంకో విషయం.. ఈ ట్రైలర్‌కి దేవిశ్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వన్నె తీసుకొచ్చిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.