Waltair Veerayya: బాసు గ్రేసుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. మెగాస్టార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమా చిరు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది. ఈ మూవీకి దేవి ఇచ్చిన సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ అనే చెప్పాలి. బాస్ పార్టీ, పూనకలు లోడింగ్ సాంగ్ అయితే మెగా ఫాన్స్ కి నిజంగానే పూనకలు తెచ్చాయి.
దాదాపు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చిరు డాన్స్ గ్రేస్ సూపర్బ్ గా ఉంటుంది. ఆ ఏజ్ లో కూడా అంత ఈజ్ తో డాన్స్ చెయ్యగల హీరో మరొకరు లేరు అనడంలో ఆశ్చర్యం లేదు. శృతి హాసన్ కూడా చిరు పక్కన అందంగా డాన్స్ చేస్తుంది. లిరికల్ సాంగ్ సమయంలో ఈ సాంగ్ బాగానే ఉంది అనిపించింది కానీ సినిమాలో డైరెక్ట్ గా చూస్తే మాత్రం ఈ పాట బాగా నచ్చుతుంది. ఫారిన్ లోకేషన్స్, చిరు డాన్స్ లో గ్రేస్, శృతి గ్లామర్ అన్నీ పుష్కలంగా ఉన్న ‘నీకేమో అందం ఎక్కువ’ సాంగ్ ఇప్పుడు యుట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతుంది.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?