జయాపజయాలతో నిమిత్తం లేకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకొని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లాస్, మాస్ అనే తేడాను చెరిపేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది ఇప్పటికే వరుణ్ తేజ్ నటించిన ‘గని’, ‘ఎఫ్ 3’ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ‘గని’ పరాజయం పాలు కాగా, ‘ఎఫ్ 3’ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఓ ఆసక్తికరమైన వీడియోను శనివారం విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది.
ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్ తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 19న తెలియబోతున్నాయి. అదే రోజున మూవీ షూటింగ్ కూడా ప్రారంభమౌతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్, లో తన పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా హోంవర్క్ చేశారని, అన్ని విధాలుగా ఈ పాత్ర కోసం సిద్ధమయ్యారు తాజా విడుదల చేసిన పిక్ బట్టి అర్థమౌతోంది.
Touch the sky with Glory!🇮🇳#VT13 pic.twitter.com/FJ12cm40gR
— Varun Tej Konidela (@IAmVarunTej) September 17, 2022