Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్ వర్క్ వల్లే లేట్ అవుతోందని తెలుస్తోంది. షూటింగ్ స్పీడుగానే జరుగుతున్నా వీఎఫ్ ఎక్స్ పనుల్లో వశిష్ట ఆలస్యం అవుతున్నాడంట. ఈ మూవీని భారీ పీరియాడికల్ మూవీగా తెస్తున్నారు.
Read Also : OG : ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..
వీఎఫ్ ఎక్స్ ఎక్కువగా వాడేస్తున్నారు. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 18న వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం అయితే జరుగుతోంది. ఓజీతో పోటీ అనుకున్నా సరే విశ్వంభర సెప్టెంబర్ లోనే రావాలని చూస్తున్నాడంట. ఆగస్టులో కూలీ, వార్-2 సినిమాలు ఉన్నాయి. కానీ ఆగస్టు వరకు వీఎఫ్ ఎక్స్ పనులు అయ్యేలా లేవు. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలోపు మూవీని కంప్లీట్ చేసేసి ప్రమోషన్లలో జోరు పెంచాలని చూస్తున్నారంట. ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 25 మధ్యలో పెద్ద సినిమాలు లేవు. ఈ గ్యాప్ ను విశ్వంభర వాడుకుంటే బెటర్ అంటున్నారు ట్రేడ్ పండితులు. అన్నీ కుదిరితే ఆగస్టు చివరి వారంలో వచ్చినా మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి విశ్వంభర ఎప్పుడు వస్తాడో చూడాలి.
Read Also : Pooja Hegde : పూజాహెగ్డే ఊపేసింది భయ్యా.. డ్యాన్స్ అదుర్స్..
