Vishnu Manchu and Panel Approved to Continue Leadership of Movie Artist Association: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకున్నదని,. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దీంతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది అని వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేమంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ మీటింగ్‌లో అనేక విషయాలు చర్చల్లోకి వచ్చాయి.
Malavika Mohanan : అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మలయాళ బ్యూటీ..
‘మా’ బిల్డింగ్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ప్రస్తుత నాయకత్వం, గౌరవనీయులైన ప్రెసిడెంట్ విష్ణు మంచు మార్గదర్శకత్వంలోనే కొనసాగుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. సుమారు 400 మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో మేలో జరగబోయే ఎన్నికలు, జూలైలో జరగనున్న నిధుల సేకరణ కార్యక్రమం, ‘మా’ భవన నిర్మాణంలో కొనసాగుతున్న వివిధ ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ‘మా’ భవనం విజయవంతంగా పూర్తయ్యే వరకు అధ్యక్షుడు విష్ణు మంచు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు ప్రస్తుత సభ్యులందరి నుంచి ఏకగ్రీవ మద్దతు లభించిందని తెలుస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎవరైనా పోటీ చేయడానికి ముందుకు వెళితే ఏకగ్రీవం కాస్త ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.