Vishal : హీరో విశాల్ ఇప్పుడు జోష్ మూడ్ లో ఉన్నాడు. ధన్సికతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే చెప్పాడు. మరో రెండు నెలల్లో అది కంప్లీట్ కాబోతోంది. ఆ వెంటనే విశాల్ పెళ్లి జరగబోతోంది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత విశాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఇప్పటి వరకు ఒకలా ఉన్నాను. కానీ ఇక నుంచి పూర్తిగా మారిపోవాలని నిర్ణయించుకున్నా. పెళ్లి తర్వాత కొన్ని రకాల సీన్లకు దూరంగా ఉండబోతున్నాను అని తెలిపాడు.
Read Also : Mahavatar Narsimha : ఆస్తులన్నీ అమ్ముకున్నా.. మహావతార్ డైరెక్టర్ కష్టాలు
హీరోయిన్లతో లిప్ లాక్ లాంటి బోల్డ్ సీన్లు ఇక నుంచి చేయను. కేవలం మంచి కంటెంట్ ఉన్న మూవీలు మాత్రమే చేస్తాను. గతంతో పోలిస్తే ఇప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి. స్టోరీ సెలక్షన్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేయనటువంటి కొత్త తరహా కథలను ఎంచుకునేందుకు రెడీ అవుతున్నాను. సాయి ధన్సికతో నా ప్రయాణం చాలా అందంగా ఉంది. ఇన్నేళ్లు ఒకరిని ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాం. మున్ముందు మరింత అందంగా మా జీవితాలను మార్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అని తెలిపాడు విశాల్.
Read Also : Keerthi Bhat : వాళ్ల లాగా పొట్టిబట్టలు వేసుకుంటేనే ఛాన్సులు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం