Vishal: ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ తనను ఎంతో ఇబ్బందులకు గురిచేసాడని, నా ప్లేస్ లో మరో హీరో ఉంటే చచ్చిపోయేవాడని ఘాటు ఆరోపణలు చేశాడు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోని అనే సినిమాలో నటిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాల్ ప్రమోషన్స్ షురూ చేశాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనతో కలిసి పనిచేసిన ఒక డైరెక్టర్ గురించి విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిస్కిన్. వీరిద్దరి కాంబోలో తుప్పరివాలన్ అనే సినిమా వచ్చింది. తెలుగులో ఇదే సినిమా డిటెక్టివ్ పేరుతో రిలీజ్ అయ్యింది. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం విశాల్ కు భారీ విజయాన్ని తీసుకొచ్చిపెట్టింది.
Akkineni Nagarjuna: ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ?
Also Read
- Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
- Jailer 2 : 'జైలర్ 2' రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
- Neha Dhupia: 'ఇదంతా వెంటనే ఆపండి'.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
- Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
ఇక ఆ విజయంతోనే వీరు తుప్పరివాలన్ 2 ప్లాన్ చేశారు. అది అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, ఆ ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోయింది. ఇక దానికి కారణం విశాల్ చెప్పుకొచ్చాడు.. ” తుప్పరివాలన్ 2 విషయంలో నేను పడ్డ బాధలు అన్ని ఇన్ని కావు.. మిస్కిన్ తో మరోసారి పనిచేయడం జరగని పని. అతను పెట్టిన ఇబ్బందులకు.. మరో హీరో అయితే గుండెపోటు వచ్చి చచ్చేవాడు.. నేను ఎన్నో సార్లు లండన్ వీధుల్లో కూర్చొని బాధపడ్డాను. ఆ క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. ఎంతో నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టినా అది పూర్తవదు అని తెలుసు. అందుకే ఆ సినిమాను మధ్యలోనే ఆపేసాను. వచ్చే ఏడాది.. ఆ సినిమాను నేనే తెరకెక్కించాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మార్క్ ఆంటోని సినిమాతో విశాల్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?