బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. బ్లూ కలర్ డ్రెస్సులో ఇద్దరు ఫోటో సెషన్ నిర్వహించడం .. అవి కాస్త వైరల్ గా మారడం కూడా జరిగాయి. అయితే అప్పుడు బయటికి రాని ఒక అన్ సీన్ వీడియో ఇప్పడూ వైరల్ గా మారింది. ఈ వీడియోలో రణబీర్ కొద్దిగా చిరాకుగా కనిపించాడు. ఆలియా నవ్వులు చిందిస్తున్నా పట్టించుకోకుండా ముభావంగా కనిపించాడు. అంతేకాకుండా ఆలియా వేసుకున్న లెహంగాను రణబీర్ కాలితో తన్నడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు మెట్లుదిగి వస్తున్న క్రమంలో ముందున్న పూలను పట్టించుకోకుండా ఆలియా నడుస్తుండడం.. ఆమె వెనుక లెహెంగా నేలను ఈడ్చుకుంటూ పూలను తాకుతూ వెళ్ళింది. దీంతో వెంటనే రణబీర్ తన పాదంతో ఆలియా లెహంగా పక్కకు లాగాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రణబీర్ ప్రవర్తించిన తీరును ఎండగడుతున్నారు. ప్రేయసి దుస్తులను పక్కకి జరిపే విధానం అదేనా..? అని కొందరు.. అసలు ఆలియానే పట్టించుకోవడం లేదు.. ఇంకా ఆమె లెహంగాను ఏం పట్టించుకొంటాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఏది సరసమా.. విరసమా కొంచెం చెప్పండి అంటూ అడిగేస్తున్నారు. ఇకపోతే ఈ జంట వివాహం వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.